బుద్ధుడిని ఒక శిష్యుడు ఇలా అడిగాడు
" విషం " అంటే ఏమిటి?
బుద్ధుడు దానికి అద్భుతమైన సమదానమిచాడు
మనవ జీవితంలో ఏదైనా సరిపడెంత
వరకు ఉంటే సౌకర్యవంతం ! మితి మీరితే విషమే ! కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే అన్ని మతాల దేవతలు కలిసి ఒక చోట
సమావేశమయ్యారు...
వారంతా ఒక 'అసామాన్య శక్తి ' గురించి
మాట్లాడుకుంటున్నారు....
మాట్లాడుకుంటున్నారు....
ఎవరైనా ఏదైనా సాధించే 'అసామాన్య శక్తి ' ఎక్కడ
దాచేద్దమా... అని వారిలో వారు
ప్రశ్నించుకుంటున్నారట.......
దాచేద్దమా... అని వారిలో వారు
ప్రశ్నించుకుంటున్నారట.......
![]() |
'అసామాన్య శక్తి ' |
ఆ సమయం లో కొందరు సూర్యమండలం అని

మరి కొందరు చంద్రమండలం అని
ఇంకొందరు భూమండలం అని
చాల రకాలుగా చర్చించుకుని...
మనిషి ఎక్కడ దాచిన ఈ 'అసామాన్య శక్తి ' ని కనుగొంటాడు... అప్పుడు మనల్ని మించి పోతాడు...
కాబట్టి అది మనిషి మనసులోనే దాచేద్దం , 
అక్కడ ఉన్నట్టు అతనికి అనుమానమే రాదు...అని తెల్చారట.
అలా ప్రతీ మనసు లో ఏదైనా సాధించే ఆ 'అసామాన్య శక్తి ' నిక్షిప్తమై ఉంది ...
ఆ 'అసామాన్య శక్తి ' తనలోనే ఉండనే సత్యాన్ని గ్రహించిన ప్రతీ వ్యక్తీ కూడా ప్రపంచం లో ఇంతమంది ఇన్ని రకాలుగా విజయాలు సాధిస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను? అనే భావం లో కలుగక మానదు. అందుకే ప్రతీ వ్యక్తి తన మనసులో ఆ 'అసామాన్య శక్తి ' ని గ్రహిస్తూ ... తనకిష్టమైన రంగంలో ( విద్య వైద్య వ్యాపార వ్యవసాయ, రాజకీయ ,ఉద్యోగం ) విజయం సాధించి తనతో పాటు ప్రపంచాన్ని అభివృద్ధి బాట లో నడిపిస్తారు
ఎప్పుడైతే మనిషి మనసులో ఇంతటి 'అసామాన్య శక్తి ' ఉందని గ్రహిస్తాడో , అప్పట్నుండి తను సాధించ లేనిది అంటూ ఏది ఉండదు, ప్రపంచాన్ని కొత్త కోణం లో చూడటం ప్రారంభిస్తాడు. ఈ శక్తి గురించి తెలియని వాళ్ళు ప్రపంచం లో 90% పైగానే ఉన్నారు. ఆ 10% ప్రపంచాన్ని నడిపిస్తున్నారని ఒక అంచనా... జీవితం అంతా అయిపోయాక ఏం సాధించాం అని ప్రశ్నించుకుంటే ? జీవితం లో ఏదో చదివేసాం, ఏదో జాబు లో క్రున్గిపోవటం కాదు మిత్రమా.. మన జీవితం లో ఎదురయ్యే ప్రతీ సన్నివేశం కూడా అది మన పరీక్షించేదుకే........ అని గ్రహించాలి .
ఇప్పుడు విజయం సాధించిన ప్రతీ ఒక్కరు కొంత కాల క్రితమే ఆ 'అసామాన్య శక్తి ' ని పసిగాట్టారని అర్ధం కావలి.
చిన్న ఉద్యోగం తో ఎన్నాళ్ళు విలపిస్తావు? నువ్వే పెద్ద ఉద్యోగం ఇచ్చేవాడిగా భవిష్యత్ ఉహిస్తే? ఎంత బావుందో కదా...
కాబట్టి ఫ్రెండ్స్ మనలో ఉన్న ఆ మానవాతీత 'అసామాన్య శక్తి ' ని గుర్తు చేసుకుంటూ... మన లక్ష్యాన్ని అందుకునే విధం గా పయనిద్దాం...
ఒక విజయం సాధించిన వాడికి రెండో విజయం సాధించటం పెద్ద కష్టమనిపించదు, సమస్యల్లా మొదటి విజయం సాధించటమే..
" సమస్త శక్తీ నీలోనే ఉంది " దాన్ని గుర్తించి సాధన చేస్తే విజయం దాసోహం అంటూ... నీ వద్దకు వస్తుంది.
..........లే మిత్రమా ఆ 'అసామాన్య శక్తి ' నీలోనీ ఉంది . ప్రపంచానికి నీ ఆలోచనలు కావలి. నిద్రిస్తున్న నీ మనస్సుకు కొత్త రంగుల లోకం చూపించు........
..........లే మిత్రమా ఆ 'అసామాన్య శక్తి ' నీలోనీ ఉంది . ప్రపంచానికి నీ ఆలోచనలు కావలి. నిద్రిస్తున్న నీ మనస్సుకు కొత్త రంగుల లోకం చూపించు........
నా ఉద్దేశం ప్రకారం భవిష్యత్ ఉహించె శక్తి మానవునికి ఉంది. అని నీవూ నిరూపించే రోజు తొందర్లోనే వస్తుందని ఆశిస్తూ ... ప్రేమతో...
శివకుమార్
Be cool Be Happy Share Yours Feeling With Me ...
మనశ్శాంతి అనేది మనిషికి చాలా అవసరం .అది లేకపోతే దగ్గర ఉన్న దాన్ని వదిలి వేసి ఎక్కడో ఏదో వెతకటం వంటివి జరుగుతాయి... ....
ఈ సందర్భంగా రామకృష్ణ పరమ హంస చెప్పిన చిన్న కధను గుర్తు చేసుకుందాం ....
ఒక అడవిలో ఒక వ్యక్తి పశువుల కాపలా కాస్తున్నాడు , చీకటిపడింది రాత్రికి అక్కడే ఉందామనుకున్నాడు కొంతసేపటికి అతనికి చుట్ట కాల్చాలి అనిపించింది, అతని వద్ద నిప్పు లేదు . అడవికి సమీప గ్రామం లో స్నేహితుని వద్దకు వెళ్ళి నిప్పు అడిగాడు . తన స్నేహితుడు చిన్నగా నవ్వుతూ ఓరి పిచ్చివాడా .... ఇంత చీకటి లో హరికేన్ లాంతరు సహాయం తో వచ్చావ్ కదా ఆ లాంతరు మంట సరిపోదా నీ చుట్టకి అన్నాడట ....
చూసారా మన ఆలోచన ధోరణి మనశ్శాంతి లేక పోతే ఇలానే ఉంటుంది ...
మనిషి జీవితం లో ఏదొక రోజు విచారం రావచ్చు ..
విచారం అనేది చుట్టంచూపు లా ఉండాలి వచ్చి పోవాలి ,
నిత్యమై మనలో ఉండిపోకూడదు .
అలా ఉండిపోతే మనశ్శాంతి కరువౌతుంది....
మనుగడకి మనం దూరమౌతాం..........
సంతోషం సగం బలం అంటారు పెద్దలు
Be cool Be Happy Share Yours Feeling With Me
మనిషి కి పట్టుదల , శ్రమ , కృషి తో పాటు ఆత్మ విశ్వాసం అనేది చాల అవసరం !!!
ఆత్మ విశ్వాసం తో ఏదైనా సాధించవచ్చు . సాధించగలం.
ఈ సందర్భం గా " నిజమైన కధ " చెప్తున్నా .....
స్వాతంత్ర సమర యోధురాలు దుర్గ భాయి గారి భర్త చింతామణి దేశ్ముఖ్ !
చింతామని గారి చిన్న తనం లో ఇండియన్ సివిల్స్ పరీక్ష రాసి సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికెళ్ళి ఆడుకుంటూన్నాడట . ఆ సమయం లో దూరం నుంచి స్నేహితుడి పరిగెత్తుకుంటూ వచ్చి నీకో గుడ్ న్యూస్ ఇండియన్ సివిల్స్ రిసల్ట్ వచ్చాయి అన్నాడట !!!!
అప్పుడు చాలా కూల్ గా , హ్యాపీ గా ఆహా ? సెకండ్ ఎవరోచ్చారట అన్నారంటా ...................?
చూసారా చింతామని గారి ఆత్మ విశ్వాసం ........
(నిజానికి ఆ ఇయర్ అల్ ఇండియా టోపర్ కూడా ఆయనే .)
మనిషి ఏదైతే కావాలను కుంటాడో..... మనస్సు అక్కడ నిమగ్నం చేసి , అది నేను కూడా సంపాదించగలను అనే ఆత్మ విశ్వాసం మొదలవ్వాలి , తర్వాత , కృషి,శ్రమ చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురైన వీడని ఉడుం పట్టు పట్టాలి ... అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది.
Be cool Be Happy Share Yours Feeling With Me .....
భయపడనంత వరకూ విజయమే.....
ఓడిపోతాను అనే అనుమానం ఉన్నా అపజయమే....
సాధన ఉంటే ఏదైనా సాధ్యమే..
సాధ్యపడకపోతే మళ్ళీ ప్రయత్నమే...
సాధించే వయస్సు మనకుంది మాత్రమే..
అది కాస్త దాటితే బ్రతుకంత శూన్యమే....
నిరంతర సాధన ఉంటే ఊహించని ఫలితమే...
Be cool Be Happy Share Yours Feeling With Me
సమస్త శక్తి నీలోనే ఉంది , నీవు ఏదైనా చేయగలవు అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, అప్పటి నుండి విజయం నీ బానిస అవుతుంది.
జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనస్సే ప్రధానం .
సజ్జనులకు మేలు జరగటం ఆలస్యం అవుతుందేమో గాని కీడు మాత్రం జరుగదు.
బలమే జీవనం- బలహీనతే మరణం.
ఎవరు ఏమి చెప్పిన విను, మంచిదైతే నేర్చుకోవటానికి ప్రయత్నించు ,
ఎందుకంటే అందరికి అన్నితెలియవు, కాని ప్రతీ ఒక్కరికిఏదో
ఒకటి తప్పకుండా తెలుసు.
Be cool Be Happy Share Yours Feeling With Me ....
SIVAKUMAR
1.పూర్వ జన్మ లో నా గొప్ప గొప్ప ప్రేమ కదా చెప్తున్నా.... విను నేస్తమా..!
చల్లనైన వెన్నెలమ్మ ఒడిలో నిదుర పోతున్న రెండు నిస్వార్ద హృదయాలు మనవి.
ఒక రోజు చిగురాకు రాల్చిన మంచు కి నీవు ఉలిక్కి పడి లేచావ్....
అది గమనించిన నేను నా హృదయం లో నిదుర పో అన్నాను....
కొంత సేపటికి మళ్లీ నిద్ర లేవటం గమనించా ఏమైంది బంగారం అని అడిగా ఆశ్చర్యపడుతూ.....
నీ గుండె చప్పుడు మేల్కొనేల చేసింది అన్నావు అమాయకంగా.....
బాధపడకు నేస్తం నీకోసం ఆ చప్పుడు ఆపుతా అని నేను కన్ను ముసాను....
ఇప్పుడు మళ్లీ పుట్టింది నీకోసమే ప్రియా...
చచ్చేంత ప్రేమ తో నీ శివకుమార్......
2. అనగనగా ఒక రాజు గారు వేటకు బయల్దేరారు .
అడవి లో వేట కోసం తిరిగి తిరిగి అలసిపోయారు .
చీకటిపడింది ఆకలి వేస్తుంది ఏమి దొరక లేదు ....
నిద్ర పోవటానికి ప్రయత్నించారు.
కాని నిద్ర పట్టలేదు కారణం ఏమి తినలేదు .
.......
.......
.......
.......
నీకేం రోగం తిన్నావ్ కదా పడుకో........ గుడ్ నైట్
డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు ఇది చట్టం...
బార్ల దగ్గరా వైన్స్ షాప్స్ దగ్గరా బైక్ లేదా కారు పార్కింగ్ ఎందుకుంటుంది.....?
(ఆల్కహాల్ ఇంటికి తీసుకెళ్ళేవారు కేవలం 30% ఉంటే . అక్కడే త్రాగి వాహనం నడిపే మహానుభావులు 70% ఉన్నారట )
**************************************
మనకు తెలిసిన నిజం కన్నా,
దేవుడు మనిషిని సృష్టించింది
ఇతరులను హింసించటానికి కాదు , ప్రేమించటానికి ,
మనస్పూర్తి గా ఇతరులకు సేవ చేయటం ... దేవుడికి సేవ చేసినట్లే ....
దేవుడికి దణ్ణం ఒకటే పెడితే సంతోషిస్తాడనుకోకు ...
ఆకలి అన్నవాడికి వీలైతే అన్నం పెట్టండి ....
మానవ సేవే .... మాధవ సేవ !
******************************************************************************
ప్రపంచం లో ఒక వ్యక్తి మరణించటం అంటే ఒక అంకె తగ్గింది అని అర్ధం కాదు........
(ఆల్కహాల్ ఇంటికి తీసుకెళ్ళేవారు కేవలం 30% ఉంటే . అక్కడే త్రాగి వాహనం నడిపే మహానుభావులు 70% ఉన్నారట )
**************************************
మనకు తెలిసిన నిజం కన్నా,
మనకు తెలియని నిజమే గొప్పది,
మనం భ్రమ పడి నిజం అని నమ్మినది నిజం కాదు,
నిజానిని మించినది మరొకటి ఉంది,
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజం,
కాని దానికి మించిన నిజం మరొకటి ఉంది,
సూర్యుడు కదలడు కాని భూమే పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది ఇది మనకు తెలిసిన నిజాన్ని మించిన నిజం....
Greatindian444@gmail.com
*****************************************************************************
దేవుడు మనిషిని సృష్టించింది
ఇతరులను హింసించటానికి కాదు , ప్రేమించటానికి ,
మనస్పూర్తి గా ఇతరులకు సేవ చేయటం ... దేవుడికి సేవ చేసినట్లే ....
దేవుడికి దణ్ణం ఒకటే పెడితే సంతోషిస్తాడనుకోకు ...
ఆకలి అన్నవాడికి వీలైతే అన్నం పెట్టండి ....
మానవ సేవే .... మాధవ సేవ !
******************************************************************************
ప్రపంచం లో ఒక వ్యక్తి మరణించటం అంటే ఒక అంకె తగ్గింది అని అర్ధం కాదు........
ఆ వ్యక్తి తో ముడిపడి ఉన్న భవిష్యత్ ఆనందాలు అంతం కావటం అని అర్ధం....
........
........
***************************************
లక్ష్యం లేని జీవితానికి లక్ష్యం వెదకడం కన్నా........
లక్ష్యం ఉన్న జీవితానికి దారి చూపటం మిన్న................
***********************************************************************************
లక్ష్యం లేని జీవితానికి లక్ష్యం వెదకడం కన్నా........
లక్ష్యం ఉన్న జీవితానికి దారి చూపటం మిన్న................
***********************************************************************************
ఆత్మ నిగ్రహమున్నవారు, దీక్షగా పనిచేసేవారు
మాట్లాడరు.మాటలు,పని ఏకకాలంలో
సాగవు, ప్రకృతిని చూడండి. నిర్విరామముగా
పనిచేస్తూనే ఉంటుంది నిశ్శబ్దముగా.మన
స్వభావాన్ని ఉన్నదానికంటే చాలా మెరుగ్గా
ప్రదర్శించాలని తాపత్రయపడతాం.కాని మన
మానసిక స్థాయి ఎంతలో ఉంటే అంతలోనే
కనిపించడం ఎంతో బాగుంటుంది. ఆ స్థాయిని దాటి
ఎదగలనుకుంటే మాత్రం ఉన్నతంగా ఆలోచించాలి.
అది సాధ్యం కాకపోతే ఉన్నట్లుగానే
కనిపించాలి. అంత స్వచ్చంగా ఉన్నపుడే ఏదో ఒక
రోజున కోరుకున్న శిఖరాలను అధిరోహించ
గలుగుతాము.
కష్టించి పని చేసేవానికే విశ్రాంతిలోని ఆనందం
తెలుస్తుంది.
ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను
ఆ ప్రగతిని గుర్తిస్తాను.
అందం నడవడికలో వుంటుంది కాని ఆడంబరంలో
కాదు.
ధైర్యగుణాన్ని మనిషి బాహ్య ప్రపంచంలో ఎక్కడా
పొందలేడు. అది మనిషి స్వభావం లోంచే
పుడుతుంది.
నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ
తగ్గించలేరు.
జీవితమంటే విశ్రాంతి కాదు, చైతన్యం అందుకే
జీవితమంతా ఆచరణ,ఆచరణ,ఆచరణ.
అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది.
అవినీతికి దిగినప్పుడే మన పతనం
ప్రాంభమవుతుంది.
శారీరక సామర్థ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచి
పెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది సాధ్యం
రాళ్లతో కట్టబడే ఆలయం కంటే
నరాలు,రక్తమాంసాలతో కట్టబడియున్న మనిషి
శరీరమే నిజమైన ఆలయం.
దేవుడ్ని దర్శించేందుకు నిజము,ప్రేమ,అహింస
అనునవి మూడు మార్గములగును.
హృదయంలో ఉంటుంది.
ఆదర్శమంటూ లేని మనిషి తెడ్డులేని నావ
లాంటివాడు.
సత్యం శాశ్వతమైనది, సత్యమే పలుకుట వలన
మనిషి గౌరవం పెంచుతూ, మానవత్వ విలువలను
కాపాడిన వారవుతాము.
మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను
పునరావృతం చేయడం కాదు. నూతన చరిత్రను
సృష్టించగలగాలి.
ఒక పువ్వు విచ్చుకోగానే ఎంత సువాసన వస్తుందో
ఒక మంచి పుస్తకం తెరవగానే అంత విజ్ఞానం
కనిపిస్తుంది.
మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య, విలువ
లేనిది.
లేనిది.
మతము లేకుండా ఏ మనిషి బ్రతుకలేడు.కొందరు
తమ అహంకారము వలన తమకు మతానికి ఏ
విధమైన సంబంధం లేదు అని చెప్పుతున్నారు. ఈ
విధంగా చెప్పడం నేను శ్వాస వదులుతున్నాను.
అయితే నేను శ్వాసించలేదు అని చెప్పే విధంగా
వుంటుంది.
హృదయం అనేది తెలివి కంటే గొప్పది.మెదడులో
తెలివిని చేర్చడం కంటె, హృదయన్ని ఉపయోగించి
పెరగడం పైనే దృష్టి సారించండి.
కోపమో, పగో లేకుండా కష్టాన్ని ఒకడు భరిస్తే వాడు
సూర్యుడికి సమానమవుతాడు...దాని ముందు
రాయిలాంటి హృదయమైనా కరుగుతుంది.
తనను తాను శాసించుకొనలేనివాడు, ఇతరులను
శాసించడంలోనూ విజయం పొందలేడు.
సత్కార్యాలు చేసి చూపెట్టు. చేస్తానంటూ ప్రచారం
చేసుకుంటూ ఊరికే మురిసిపోకు.
గమ్యం లేని నావలాగా ఆదర్శం లేని శ్రమ నిరర్థకం.
చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రికరించ గలిగిన
మానవుడు చివరకు దేన్నైనా సాధించగల శక్తిని
సంపాదిస్తాడు.
పైకి కనిపించేదే అశుభ్రం కాదు.తెల్లటి వస్తువు మీద
చిన్న మరక పడినా వెంటనే గుర్తిస్తాం. నలుపు మీద
చిన్న మరక పడినా వెంటనే గుర్తించం. నలుపు మీద
ఎంత మాలిన్యం ఉన్నా కనిపించదు,పట్టించుకోము.
'నిజమైన బలం' అన్నది బలశాలి శారీరక శక్తిలో
లేదు. కానీ అది
మనశ్శక్తిలోనూ,ఆత్మజ్ఞానంలోనూ,మరణ భయం
నుంచి విముక్తి పొందడంలోను ఉంటుంది.
జీవితం,మృత్యువు ఒకే నాణానికి రెండు ప్రక్కల
వంటివి.
విద్యను దాచుకోకు దానిని పది మందికీ పంచితే
మరింత రాణిస్తుంది.
సత్యాన్ని మించినా అందం లేదు.
ఆశ మానవుణ్ణీ గొప్పవాణ్ణి చేస్తుంది. దురాశ
మానవుణ్ణి నీచుణ్ణి చేస్తుంది.
ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ,
బాధ్యతలను విస్మరిస్తే అరాజకం తప్పదు.
మీరు ఏది చెప్పినను మీ మనస్సుకు,ప్రపంచానికి
నిజముగానే నడుచుకోండి.
ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు.
చెడు వేరు,చెడును చేసేవారు వేరు అనే భావనను
ఎల్లప్పుడు మర్చిపోకూడదు.
నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే
వారి వల్లనే నేను అధికముగా మంచిని
పొందియున్నాను.
బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదు,
అది బలవంతుడి లక్షణం.
మతాలన్నీ గొప్పవే వాటిలో దోషమేమి లేదు,
దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది.
నిజాయితీతోనే మన జీవితం నిలబడుతుంది,
అవినీతికి దిగినప్పుడే మన పతనం
ప్రాంభమవుతుంది.
ప్రయత్నం పురుషుని వంతు అయితే ఫలం ఇవ్వడం
పురుషోత్తముని వంతు.
ప్రేమ బాధల్ని సహిస్తుందే కాని ఎప్పుడూ ప్రతీకారాన్ని
తలపెట్టదు.
మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువ లేనిది.
అధికారం రెండు రకాలు,భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చేదానికన్నా శక్తివంతమైనది.
చెడు వేరు,చెడును చేసేవారు వేరు అనే భావనను ఎల్లప్పుడు మర్చిపోకూడదు.
నా ఇంటి కిటికీలు మూసి ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. భిన్నదేశాల సంస్కృతుల పవనాలు వాటి గుండా స్వేచ్చగా ప్రయాణించాలి. అలాగని నా కాళ్లు లాగేస్తానంటే ఒప్పుకోను . ఇతరుల ఇంట్లో బానిసలా, బిచ్చగాడిలా ఉండటాన్ని కూడా అంగీకరించను.
గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిరంతరం విశ్వాసిస్తాను.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు,రంగులగోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
ఇతరులకి ఉపయోగపడటం,అబద్దాలాడకుండటం, ధర్మాన్ని ఆచరించడం,ఏ ప్రాణికి ద్రోహం చెయ్యకుండా ఉండటం, దయ కలిగి ఉండటం ,సిగ్గు పడవలిసిన పని ఏదీ చెయ్యకుండా ఉండటమే శీలం.
దేవుడు తనకు తోడుగా నున్నాడని భావించే వాడికి ఎన్నటికీ అపజయం ఉండదు.
భయం శారీరకమైన జబ్బు కాకపోవచ్చు.కానీ ఆత్మను చంపేస్తుంది.
మానవ సమాజం.......మనస్సు,మత,రాజకీయ,సామాజిక అడ్డుగోడలతో విభజింపకూడదు.
కంటిచూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు, తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గ్రుడ్డివాడు.
నియమాల్ని పాటించకుండా ఏ పని జరుగదు. గతి నిర్దేశాల్లో ఏకాస్త తేడా వచ్చినా సౌరవ్యవస్థ మొత్తం కుప్ప కూలుతుంది కదా!!!
సత్కార్యాలు చేసి చూపెట్టు. చేస్తానంటూ ప్రచారం చేసుకుంటూ ఊరికే మురిసిపోకు.
వెలుగు ఎక్కడ ఉంటుందో, నీడ కూడా అక్కడే ఉంటుంది.
కష్టాలను తప్పించుకొనే వారికంటే వాటిని
అధిగామించేవారే విజయం సాధించగలరు.
ఏదైనా పనిని ప్రేమిస్తేనే , ఆనందిస్తేనే చేయి , లేకపోతే
ఆ పనిని తలపెట్టకు .
నీ జుట్టు పట్టీ నిన్ను బానిసను చెయ్యలనుకునే వాడ్ని
నీ కాళ్ళ కిందకు వచ్చేవరకూ కష్టపడాలి మిత్రమా ...
ఎంత కాలం ఒకడి కింద బానిస బతుకు బతుకుతావు ?
డబ్బు ఉంటే చాలా అవకాశములు ఉంటాయి....
కాని పేదోడికి "బతకడం" అనే ఒక్కటే అవకాశం .....
ధనం అనే అహంకారాన్ని చంపడానికి పేదవాడు
ప్రజ్ఞావంతుడైతే చాలు ...
పదిమందిని ప్రశ్నించే స్థాయి కి ఎదగాలి..
ఎదగాలంటే విద్య ఉండాలి మరి....
మీ తల్లిదండ్రులు ఒకడి దగ్గర పనిచేస్తుంటే ఒళ్ళు
చలించపోవటం లేదా ? ఆ అమాయకులకు విముక్తిని కలిగించి....
మీరు రేపు వేలమందికి పని కలిపించే స్థాయికి రావాలి... నడు ఆ వైపుగా పయనిద్దాం .
మిమ్మల్ని ఆలోచింపజేసే ****మీ శివకుమార్
కోహినూర్ కంటే విలువైనది కాలం .......
ఎవరికోసమూ ఆగనిది ... కరిగిపోతే తిరిగి రానిది...
మనిషి తిరిగి తీసుకురాలేనిది ... సృష్టించలేనిది గడచిన క్షణ కాలం......
జీవితమనే పరీక్షలో , పరుగు పందెం లో గెలవాలంటే ప్రతీ విద్యార్ధి ఎంతో శ్రద్ధగా ఖర్చు చేయాల్సింది ....కాలమే !
ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతీ విద్యార్ది కలలు కంటాడు. మరి తాను కన్న కలలు నిజం కావాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే.... ! అదే టైం మేనేజ్మెంట్ ! అందుకే " కోహినూర్ కంటే విలువైనది కాలం" అన్నారు పెద్దలు ....! - ఆకే రవికృష్ణ IPS.,
కోహినూర్ కంటే విలువైనది కాలం .......
ఎవరికోసమూ ఆగనిది ... కరిగిపోతే తిరిగి రానిది...
మనిషి తిరిగి తీసుకురాలేనిది ... సృష్టించలేనిది గడచిన క్షణ కాలం......
జీవితమనే పరీక్షలో , పరుగు పందెం లో గెలవాలంటే ప్రతీ విద్యార్ధి ఎంతో శ్రద్ధగా ఖర్చు చేయాల్సింది ....కాలమే !
ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతీ విద్యార్ది కలలు కంటాడు. మరి తాను కన్న కలలు నిజం కావాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే.... ! అదే టైం మేనేజ్మెంట్ ! అందుకే " కోహినూర్ కంటే విలువైనది కాలం" అన్నారు పెద్దలు ....! - ఆకే రవికృష్ణ IPS.,

No comments:
Post a Comment