MORAL STORIES

ఈ ప్రపంచం లో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా ??
.
ఇపుడు మీరు చదవబోతున్నది ప్రపంచం లో వ్యాపార జగత్తులో గొప్ప వ్యక్తి " స్టీవ్ జాబ్స్ " చెప్పిన జీవిత సత్యాలు .

Steve jobs’ Last Words ------------------


వ్యాపార జగత్తులో శిఖరానికి చేరాను నేను ,,,,,,,,,,,


మీ అందరి దృష్టిలో నేను విజయానికి ప్రతీకను ,,,,,,,,,,,


పని తప్ప వేరే ఆనందానికి నేను నోచుకోలేదు .


డబ్బు ప్రపంచానికి అంకితం అయిపోయాను ,,,,,,,,,,,,,,,,,,,


ఈ మరణ శయ్య మీద చావును ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళూ గర్వపడిన నా ధనిక ప్రపంచం ఎందుకూ కొరగానిదని నాకు అనిపిస్తోంది ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఈ హాస్పిటల్ లో మిషన్ల శబ్దాలూ , పగలో రాత్రో తెలియకుండా వెలుగుతున్న లైట్లూ మధ్యలో నాకు యమధర్మరాజు శ్వాసల చప్పుడు వినిపిస్తోంది . 

.
.
నాకిప్పుడనిపిస్తోంది ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
.
జీవితం చివరి వరకూ ఎంత డబ్బు అవుసరమో అంతా సంపాదించాక మనం ఆలోచించవలసిన విషయాలు డబ్బు కాకుండా వేరే ఉన్నాయి . ,,,,,,,,,,,,,,,,,,,,,
.
బహుశా అనుబంధాలూ , కళలూ , చిన్నప్పటి కలలూ , ఏదైనా సేవ .... డబ్బుకి బాహ్యంగా ఎంతో ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి . 
.
డబ్బు వెనుక పరుగు పెట్టడం మనిషిని వక్రంగా మార్చేస్తుంది . అందుకు నేనే ఉదాహరణ . 
.
భగవానుడు మనకు ఇతరుల హృదయాలలోని ప్రేమను గుర్తించాలని జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు .

డబ్బును మాత్రమె గుర్తించే కాల్పానిక జగత్తును మనం సృష్టించుకున్నాము . 

.
నేను సంపాదించిన డబ్బును నేను నాతో కూడా తీసుకు వెళ్ళలేను .

నేను నాతో తీసుకు వెళ్ళేది ప్రేమానుభూతులను మాత్రమె . ఆ జ్ఞాపకాలు మాత్రమె !

.

.

.
ఇవే నీ కూడా ఉంటాయి . నీలో ఉంటాయి . నీతో పాటే ఉంటూ నిన్ను జీవించేలా చేస్తాయి .

ఈ ప్రేమ పూర్వక అనుభూతులే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి .


జీవితం లో ఎదుగుదలను తెస్తాయి . అంతా నీ చేతులలో నీ హృదయం లో నే ఉంది . 

.
.
ఈ ప్రపంచం లో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా ? నువ్వు రోగం తో బాధ పడుతూ పడుకున్న మంచం ,,,,,,,,,,,,,,,

నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ని నియమించుకొగలవు . నీ కోసం సంపాదించిపెట్టే ఉద్యోగులను నియమించుకొగలవు .,,,,,,,,


నీ జబ్బును అనుభవించే వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకోలేవు ....







నువ్వు దేన్నీ కోల్పోయినా తిరిగి పొందవచ్చు ,,,,,,,,,,,,,,,,,,,

.
.

కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందలేవు ,,,,,,,,,,,,,,,,, 

.
మనిషి ఆపరేషన్ రూం లోకి వెడుతున్నపుడు తెలుసుకుంటాడు " ఆరోగ్యవంతమైన జీవితం " అనే పుస్తకం ఇంకా తాను చదవలేదని . 
.
.
ఇపుడు మనం జీవితపు ఏ దశలో ఉన్నా , తెర పడి పోయే రోజు ఒకటి ఉంటుంది . 
.
మిత్రమా !!,,,,,,,,,,,,,

నిన్ను నువ్వు ప్రేమించు . నీ  కుటుంబాన్ని ప్రేమించు . నీ స్నేహితులను ప్రేమించు . ,,,,,,,,,,,,,,,,,,


నిన్ను నువ్వు బాగా చూసుకో ! ఇతరులను బాగా చూడు !

*************************

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది. 

"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి. 

కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. 

ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు. 

“…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు. 

"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు. 

ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?" 

"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు. 

కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా. 

"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు. 

ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు." 

ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు. 
అర్థం కానట్టు చూశారు ఇద్దరూ. 

“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."

" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....."

**********************************

ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర

కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. 
ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. 

త్వరలో

కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ, 
తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ,
 అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.

No comments:

Post a Comment